కృష్ణ శతక కర్త నృసింహ కవి దాదాపు క్రీ.శ. 1760 ప్రాంతములవాడు. ఇతని వివరాలు అంతగా ఈశతకము నుండి తెలియకపోయ్నా ఇతను శతకములో వాడిన కొన్ని పదాలను బట్టి ఈకవి చిత్తూరు మండలము వాడు కానీ పడమటి సీమ ప్రాంతము వాడుగా కానీ ఊహించవచ్చును.
"తిరిమణి పెట్టిన మనుజు@డు పరమపవిత్రుండు" అను పద్యాన్ని బట్టి ఈతను వైష్ణవ మతావిలంబి కావచ్చును. బహుశా ఆరువేల నియోగియోలేక గోలకొండ వ్యాపారియో కావచ్చునని శతకశాస్త్ర చరిత్రకారుల నిర్ణయము.
సుమతి, వేమన శాతకముల తరువాత అత్యంత ప్రచారములో ఉండి, మిక్కిలి ప్రజాదరణ పొందిన శతకాలలో ఈ శతకం ఒకటి. భక్తిరస ప్రధానమైన ఈశతకంలో 102 కందపద్యాలలో కృష్ణలీలలు, దశావతారములను మనోహరంగా సరళమైన భాషలో వర్ణించాడు. సరళమైన భాషలో ముద్దులొలికే తెలుగులో చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా వ్రాయటం వలన ఈశతకాన్ని పాఠశాలలో బాలబాలికలకు పాఠ్యాంశంగా చేర్చటం జరిగింది.
This version of Krishna Satakam Android App comes with one universal variant which will work on all the Android devices.
If you are looking to download other versions of Krishna Satakam Android App, We have 1 version in our database. Please select one of them below to download.